Breakthrough Science Society (BSS)బ్రేక్ త్రు సైన్స్ సొసైటీ (బిఎస్ఎస్)Andhra Pradesh State Committee96-13-726, Nagaram Palem, Guntur – 52200453-38-32, K.R.M.Colony, Seetammadhara, Visakhapatnam-13, Phone: 9391271957 _______________________________
తేది: 07-05-2020
(పత్రికా ప్రకటన)
విశాఖపట్నం నగర శివార్లలోని ఆర్.ఆర్. వెంకటాపురం గ్రామం సమీపంలో నున్న ఎల్.జి. పాలిమర్స్ లో గత రాత్రి స్టెరాయిన్ గ్యాస్ లీక్ కావడంతో ఇప్పటి వరకు 8 మంది మరణించడం  ఎంతోమంది ప్రజలు  తీవ్ర అస్వస్థతకు, తీవ్ర భయాందోళనలకు గురికావడం పట్ల బ్రేక్ త్రు సైన్స్ సొసైటీ (బిఎస్ఎస్) రాష్ట్ర కమిటి తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేస్తోంది. ఈ విషవాయువుకు గురైన చుట్టుపక్కల గ్రామాలలోని వందలాదిమంది ప్రజలు శ్వాస ఆడక రాత్రికి రాత్రే దూరంగా పరుగులు పెట్టడం, ఎక్కడకక్కడే సృహతప్పి పడిపోవడంవంటి దృశ్యాలు భయానకంగా, హృదయవిదారకంగా ఉన్నాయి. ఈ దుర్ఘటనలో ఎంతమంది మరణించారో, ఎంతమంది  అస్వస్థతకు గురైయ్యారో అంచనా వేయలేని ప్రమాదకర పరిస్థితులు ఉన్నట్లు మీడియా వెల్లడిస్తోంది. ఒక వైపు ప్రాణాంతక కరోన వైరస్ వ్యాపించి ప్రజలలో భయాందోళనలు వ్యాపించి ఉన్న సమయంలో,  విష వాయువు లీక్ కావడం ఆ ప్రాంతాలలోని ప్రజలను మరింత భయ భ్రాంతులకు గురి చేసింది. మరోవైపు ఈ విషవాయువుకు  గురై ఎన్నో పశువులు, జంతువులు కూడా మరణించాయి. ఇలాంటి దారుణ సంఘటనలకు కారణం అవుతున్న విషవాయువులను ఉపయోగించే రసాయన పరిశ్రమలను జన నివాసాల ప్రాంతాలలో ప్రభుత్వాలు అనుమతించడం, ఆ పరిశ్రమల యాజమాన్యాలు రక్షణ చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యం చేయడం చాలా నేరపూరితమైనది. ఈ మొత్తం దుర్ఘటనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, అధికారులు, పరిశ్రమ యజమాన్యం పూర్తి బాధ్యత వహించాలి. తక్షణం ప్రభుత్వ యంత్రాంగాన్నంతా ఉపయోగించి అస్వస్థతకు గురైన వారికి వెంటనే మెరుగైన వైద్యం ఉచితంగా అందించడానికి చర్యలు చేపట్టాలని, విషవాయువు ప్రభావిత ప్రాంతాలనుండి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని డిమాండ్ చేస్తున్నాము. మరణించినవారి కుటుంబాలను ఆదుకోవడానికి తగిన నష్టపరిహారం చెల్లించాలని, ఎల్.జి. పాలిమర్స్ యజమాన్యాన్ని, ఈ పరిశ్రమను అనుమతించిన అధికారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాము. ఇలాంటి ప్రమాదకర విషయవాయులతో నిర్వహించబడే పరిశ్రమలను వెంటనే జనవాస ప్రాంతాలకు దూరంగా తరలించాలని కూడా డిమాండ్ చేస్తున్నాము. 
కె. తబ్రేజ్ ఖాన్కన్వీనర్ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీబ్రేక్ త్రు సైన్స్ సొసైటీ (బిఎస్ఎస్)

ReplyForward